![]() |
![]() |
.webp)
హరితేజ బుల్లితెర మీద ఒకప్పుడు మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం, తాళి కట్టు శుభవేళ, శివరంజని, కన్యాదానం ఇలా పలు సీరియల్స్ లో నటించి ఆడియన్స్ నుంచి మంచి పేరును సంపాదించింది. ఆతర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన "అఆ" మూవీతో వెండితెర పై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ సమంత పనిమనిషిగా నటించింది. అలాగే తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది హరితేజ. అలాంటి హరితేజ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో ఆమె నెమలికి నడకలు నేర్పిస్తోంది. అదేనండి "నెమలికి నేర్పిన నడకలివి" అంటూ సప్తపది మూవీలోని సాంగ్ కి అద్భుతంగా నాట్యం చేసి ఆ వీడియోని పోస్ట్ చేసింది. "వర్షం వచ్చినప్పుడు నేను నెమలిని అవుతాను" అంటూ ఒక టాగ్ లైన్ పోస్ట్ చేసింది.
ఇక ఈమె డాన్స్ చూసిన నెటిజన్స్ ఫిదా ఐపోతున్నారు. ఇక ప్లేబాక్ సింగర్ అదితి భావరాజు ఐతే "ఎలా ఇంత అందంగా ? పారిపోదాం పెళ్లిచేసుకుందాం" అంటూ ఒక కొంటె పోస్ట్ కూడా పెట్టింది. ప్రగతి, నిత్యహరి వంటి బుల్లితెర సెలెబ్రిటీస్ కూడా మెసేజెస్ చేశారు. ఇక హరితేజ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా చేసింది. బిగ్ బాస్ లో తన ఆట, అల్లరి, హౌస్ లో చెప్పిన బుర్రకథతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాలతో పాటు చాలా టీవీ షోలకు యాంకర్ గా చేసిన హరితేజ కొంతకాలంగా బుల్లితెర మీద కానీ, సిల్వర్ స్క్రీన్ మీద కానీ కనిపించడం లేదు. ఐతే ఆమె ఈమధ్య చాలా సన్నబడింది. వర్కౌట్స్ చేస్తూ ఆ వీడియోస్ ని కూడా పోస్ట్ చేస్తోంది.
![]() |
![]() |